భారతదేశం, సెప్టెంబర్ 12 -- ఫ్యాషన్ బ్లాగింగ్ ఒకప్పుడు కేవలం కాలక్షేపం. కానీ ఇప్పుడు అది ఓ పెద్ద వ్యాపారం. కంటెంట్ క్రియేటర్లుగా మారి, బ్రాండ్‌లతో కలిసి పనిచేస్తూ, ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందుతున్న వాళ్ళు ఎందరో. అలాంటివారిలో ప్రముఖ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ క్రియేటర్ కృతికా ఖురానా ఒకరు. ఇన్‌స్టాగ్రామ్‌లో 'దట్ బోహో గర్ల్' పేరుతో ఒక మిలియన్‌కు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్న కృతికా, కంటెంట్ క్రియేషన్ ద్వారా రూ. కోట్లలో ఆదాయం ఎలా సంపాదించారో ఇటీవలే తన పోస్ట్‌లో పంచుకున్నారు. కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునేవారికి విలువైన సలహాలు కూడా ఇచ్చారు.

"కేవలం నంబర్స్ కాదు, ఆడియెన్స్‌తో కనెక్ట్ అయ్యే కంటెంట్‌నే బ్రాండ్లు ఇష్టపడతాయి" అని కృతికా స్పష్టం చేశారు. 11 ఏళ్ల క్రితం కేవలం ఒక ఆలోచనతో మొదలుపెట్టిన ఆమె, ఇప్పుడు ఎన్నో పెద్ద బ్రాండ్‌లతో కలిసి పనిచేస్తున్నార...