భారతదేశం, జూన్ 12 -- టాలీవుడ్ లో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. మంగళవారం (జూన్10) రాత్రి స్టార్ డైరెక్టర్ రవి కుమార్ చౌదరీ మరణించగా.. బుధవారం (జూన్ 11) రాత్రి సీనియర్ ప్రొడ్యూసర్ కావూరి మహేంద్ర కన్నుమూశారు. మంచి సినిమాలు ప్రొడ్యూస్ మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్న కావూరి మహేంద్ర తుదిశ్వాస విడిచారు. ఏఏ ఆర్ట్స్ అధినేత మహేంద్ర (79) నిన్న రాత్రి చనిపోయారు.

సీనియర్ ప్రొడ్యూసర్ కావూరి మహేంద్ర గత కొంతకాలంగా గుండె సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు. గుంటూరులోని రమేష్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ వచ్చారు. ఆయన భార్య, కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం కుమారుడు జీతు మరణంతో మహేంద్ర కుంగిపోయారు. మహేంద్రకు ప్రముఖ నిర్మాత, నటుడు మాదాల రవి అల్లుడు.

1946 ఫిబ్రవరి 4న గుడివాడ తాలూకు దోసపాడులో జన్మించిన కె.మహేంద్ర ముందుగా దర్శకత్వ శాఖలో శిక్షణ పొందారు. ఆ ప్ర...