భారతదేశం, మే 18 -- తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో రెండు రీసెంట్ రూమర్లు సంచలనంగా మారాయి. ఎవరూ ఇప్పటి వరకు ఊహించని రెండు కాంబినేషన్లతో ఈ పుకార్లు వస్తున్నాయి. ఈ రూమర్లు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. కొలీవుడ్ సూపర్ రజినీకాంత్‍తో తెలుగు యంగ్ డైరెక్టర్ మూవీ చేయనున్నారంటూ రూమర్ చక్కర్లు కొడుతోంది. మరో ప్రాజెక్ట్ కూడా క్రేజీ పుకారు బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇవే..

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఇప్పటి వరకు తన మార్క్ చూపించారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం చిత్రాలతో మంచి న్యూఏజ్ ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకున్నారు. సరిపోదా శనివారం మినహా మిగిలిన కామెడీ జానర్లో డిఫరెంట్ స్కీన్ ప్లేతో ఉంటాయి. అయితే, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‍తో వివేక్ ఆత్రేయ సినిమా చేయనున్నారంటూ ఓ రూమర్ తాజాగా చక్కర్లు కొడుతోంద...