Hyderabad, జూలై 19 -- తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ఇటీవల టాలీవుడ్ దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు అనారోగ్య సమస్యలతో కాలం చేసిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు ఫిష్ వెంకట్ (53) మరణించారు. శుక్రవారం (జులై 18) రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ తుది శ్వాస విడిచారు.

కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఫిష్ వెంకట్ హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. రెండు కిడ్నీలు డ్యామేజ్ కావడంతో డయాలిసిస్ కోసం బోడుప్పల్‌లోని ఓ ఆస్పత్రిలో వెంకట్‌ను కుటుంబ సభ్యులు చేర్చారు. అయితే, రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో మార్పిడి చేయాలని వైద్యులు సూచించినట్లు ఆయన కుమార్తె తెలిపారు.

రెండు కిడ్నీల మార్పుకు రూ. 50 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్స్ చెప్పినట్లు ఫిష్ వెంకట్ కూతురు ఇటీవల మీడియాకు వెల్లడించారు. వైద్య సేవలు పొందలేని దీన...