భారతదేశం, నవంబర్ 15 -- మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ కీ రోల్ ప్లే చేస్తున్నారు. భయంకరమైన విలన్ గా నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళి కన్ఫామ్ చేశారు. ఇవాళ (నవంబర్ 15) హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ స్పీచ్ వైరల్ గా మారింది.

శనివారం జరుగుతున్న గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్లో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ కామెంట్లు వైరల్ గా మారాయి. ''గత పాతికేళ్లలో ఎన్నో ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేశా. కానీ ఇంత లెవల్లో, ఇంత మంది జనంతో ఓ సినిమా లాంఛ్ కావడం మాత్రం చూడలేదు'' అని తెలుగులో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ చెప్పారు.

''చిన్నప్పటి నుంచి మలయాళ సినిమాల నుంచి ఎన్నో కథలు వింటూ పెరిగా. గొప్ప గర్వంగా మారే సినిమా కోసం మేం పని చేస్తున్నాం. ఈ సెలబ్ర...