భారతదేశం, ఏప్రిల్ 25 -- నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్‌కు భద్రతా బలగాలు శ్రీకారం చుట్టాయి. దీంతో తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కర్రెగుట్టలు ఎరుపెక్కుతున్నాయి. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం బీజాపుర్‌ జిల్లా.. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవుల్లోకి సాయుధ బలగాలు దూసుకెళ్తున్నాయి. తారసపడుతున్న మావోయిస్టులపై విరుచుకుపడుతున్నాయి. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు దాదాపు 100 పైగా ఐఈడీలను నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది. కర్రెగుట్టలను జల్లెడ పడుతున్న బలగాలకు అత్యవసర సామగ్రి, ఆహార పదార్థాలను వెంకటాపురం నుంచి హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.

2.నడిపల్లి, పూజారికాంకేర్, నంబిలో ప్రధానంగా కాల్పులు జరుగుతున్నాయి. ఊసూరు, రాంపురం, భీమంరంపాడు, కస్తూరిపాడు, చినవుట్లపల్లి, పెదవుట్లపల్లి, గుంజప...