భారతదేశం, మే 12 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలు నిర్లక్ష్యం చేసి.. హైడ్రా పేరుతో పక్కా ఇళ్లను కూలగొట్టే పనిలో ఉన్నారని.. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. 1965లో అల్వాల్‌లో ఏర్పడిన కాలనీనిలో ఇళ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తూ.. గుడులకు కూడా నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు అక్కడ జనావాసాలకు ఆస్కారం లేదని.. అప్పుడు ఇల్లు కట్టుకున్నారని వివరించారు. ఒక తరం త్యాగం చేస్తే.. రెండో తరం ఇల్లు కట్టుకుంది.. మూడో తరం చదువుకుంటోందని ఈటెల వ్యాఖ్యానించారు.

'ప్రజల జీవనంలో మంచి మార్పు వస్తదని ముఖ్యమంత్రిని చేస్తే.. మేం ఎవరు చెప్పినా వినను.. నాకు నేను నిర్ణయం తీసుకుంటానంటున్నడు. హైడ్రా పేరుతో పక్కా ఇల్లు కూలగొట్టుడే.. అడ్డమొచ్చినవాళ్లను బుల్డోజర్లతో తొక్కవలసిందే అన్నట్లుగా స్టేట్‌మెంట్ ఇస్తున్నడు. ఇంటెలిజన్స్ వ్యవస్థను అడిగినా ఇ...