భారతదేశం, అక్టోబర్ 30 -- తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి 42వ వారానికి టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఇందులో మరోసారి కార్తీకదీపం 2 సీరియల్ తన తొలి స్థానాన్ని నిలుపుకుంది. అంతేకాదు మొత్తంగా టాప్ 10లో ఆరు స్టార్ మా, నాలుగు జీ తెలుగు ఛానెల్ కు చెందిన సీరియల్స్ ఉన్నాయి.

స్టార్ మా సీరియల్స్ మరోసారి సత్తా చాటాయి. ఈ ఏడాది 42వ వారం టీఆర్పీ రేటింగ్స్ తాజాగా రిలీజ్ అయ్యాయి. అందులో కార్తీకదీపం 2 సీరియల్ తొలి స్థానంలో ఉంది. ఈ సీరియల్ రేటింగ్ తగ్గినా.. టాప్ లోనే ఉంది. ఈవారం ఈ సీరియల్ కు 13.99 రేటింగ్ నమోదైంది. గతవారం ఇది 14.90గా ఉండేది. ఈ సీరియల్ ఈ మధ్యే 500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉంది.

ఈ సీరియల్ కు 13.47 రేటింగ్ వచ్చింది. ఈ సీరియల్ ఈ మధ్యే 300 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. మూడో స్థానంలోకి మ...