భారతదేశం, జనవరి 26 -- మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇద్దరు బ్యూటిపుల్ హీరోయిన్స్ డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ నటించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వ వహించారు.

2011లో పిళ్లైయార్ తెరు కడైసి వీడు అనే తమిళ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన కిషోర్ తిరుమల తెలుగులో 2013 సంవత్సరంలో సెకండ్ హ్యాండ్ మూవీతో డైరెక్టర్‌గా అరంగేట్రం చేశారు. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత రామ్ పోతినేనితో నేను శైలజ మూవీ తీసి సూపర్ హిట్ అందుకున్నారు.

అనంతరం ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, రెడ్, ఆడవాళ్లకు మీ జోహార్లు వంటి సినిమాలను తెరకెక్కించారు కిషోర్ తిరుమల. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు డైరెక్టర్ కిషోర్ తిరుమల.

జనవరి 13న థియేటర్లలో విడు...