భారతదేశం, నవంబర్ 5 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు ఆసక్తికరంగా సాగుతోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు కూడా ప్రధాన పార్టీలు పక్కాగా అడుగులేసే పనిలో ఉన్నాయి. ఓవైపు క్షేత్రస్థాయిలో ముఖ్య నేతలను మోహరించగా. మరోవైపు పార్టీలోని కీలక నేతలు ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లతో ప్రచార వేడిని పెంచుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగులు పేలుతుండగా. మరోవైపు బీజేపీ నేతలు ఆ రెండు పార్టీలను కార్నర్ చేస్తూ ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సవాల్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ విజయం ఎంతో అవసరమన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ కానీ సీన్ రివర్స్ అయితే... ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న సంకేతాలు మరింత బలపడుతాయి. ఈ పరిణామం...