భారతదేశం, మే 2 -- టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియన్ మార్కెట్లో ఇన్నోవా హైక్రాస్ కొత్త స్పెషల్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఎక్స్ క్లూజివ్ ఎడిషన్ గా పిలిచే దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.32.58 లక్షలు. జెడ్ఎక్స్(ఓ) వేరియంట్ ఆధారంగా సూపర్ వైట్, పెర్ల్ వైట్ అనే రెండు రంగుల్లో డ్యూయల్ టోన్ తో పరిమిత కాలానికి ఇది లభిస్తుంది. ఇది 2.0-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది.

డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్స్ తో పాటు ఈ ఎక్ల్ క్లూజివ్ స్పెషల్ ఎడిషన్ లో ఇతర కాస్మెటిక్ మార్పులు కూడా ఉన్నాయి. ఈ స్పెషల్ ఎడిషన్ బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్ తో వస్తుంది. కాబట్టి, పైకప్పు, ఫ్రంట్ గ్రిల్, రియర్ గార్నిష్, అల్లాయ్ వీల్స్ మరియు హుడ్ చిహ్నం ఇప్పుడు నలుపు రంగులో ఉన్నాయి. ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, గ్రిల్ గార్నిష్ ఉన్నాయి. ఇరువైపులా వీల్ ఆర్చ్ మౌల్డింగ్, బయటి రియర్ వ్యూ మిర్రర్ కోసం గార్...