భారతదేశం, జూలై 7 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ ఎస్​యూవీల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా రూ. 21-22 లక్షల ధరల విభాగంలో పోటీ తీవ్రంగా ఉంది. ఈ ధరలో ప్రముఖంగా లభిస్తున్న రెండు ఎలక్ట్రిక్ ఎస్​యూవీలు.. టాటా హారియర్ ఈవీ అడ్వెంచర్ వేరియంట్, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్మార్ట్ (O) లాంగ్ రేంజ్ ట్రిమ్. ధర దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ, ఈ రెండు ఎలక్ట్రిక్ వాహనాలు వేర్వేరు వినియోగదారుల అవసరాలను తీర్చడానికి రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

పరిమాణం విషయంలో టాటా హారియర్ ఈవీ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కంటే గణనీయంగా పెద్దది! హారియర్ ఈవీ 267 ఎంఎం పొడవు, 132 ఎంఎం. వెడల్పు, 85 ఎంఎం ఎత్తుగా ఉంటుంది. క్రెటా వీల్‌బేస్ 2,610 ఎంఎంతో పోల్చిత హారియర్​ ఈవీ 2,741 ఎంఎం వీల్‌బేస్ రేర్​ సీట్లలో మరింత విశాలమైన స్థ...