భారతదేశం, డిసెంబర్ 17 -- ముంబై, డిసెంబర్ 17, 2025: భారతీయ రోడ్లపై ఒకప్పుడు రాజసం ఒలకబోసిన 'టాటా సియెర్రా' ఇప్పుడు సరికొత్త అవతారంలో మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఆటోమొబైల్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఐకానిక్ కారు.. బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 24 గంటల్లోనే రికార్డులను తిరగరాసింది. మొదటి రోజే ఏకంగా 70,000కు పైగా ధృవీకరించిన (Confirmed) బుకింగ్స్‌ను సాధించి మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది.

కేవలం బుకింగ్స్ మాత్రమే కాదు, మరో 1.35 లక్షల మంది కస్టమర్లు తమకు నచ్చిన విధంగా కారును కాన్ఫిగర్ (Configuration) చేసుకుని, కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే, సియెర్రా పట్ల భారతీయులకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది.

ప్రీమియం మిడ్-ఎస్యూవీ విభాగంలో సియెర్రా సృష్టిస్తున్న ఈ ప్రభంజనంపై టాట...