భారతదేశం, నవంబర్ 2 -- టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) భారతీయ ప్యాసింజర్ వాహనాల రిటైల్ మార్కెట్‌లో తన నెం. 2 స్థానాన్ని వరుసగా రెండో నెల పదిలం చేసుకుంది! ప్రభుత్వ వాహన్ పోర్టల్ (తెలంగాణ మినహాయించి) నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ విషయం స్పష్టమైంది.

అక్టోబర్ 2025లో కంపెనీ మొత్తం 73,879 యూనిట్లను విక్రయించింది. ఈ సంఖ్య మహీంద్రా అండ్​ మహీంద్రా (67,444 యూనిట్లు), హ్యుందాయ్ మోటార్ ఇండియా (65,048 యూనిట్లు) విక్రయాల కంటే చాలా ఎక్కువ!

టాటా మోటార్స్ తన సమీప ప్రత్యర్థుల మధ్య ఉన్న అంతరాన్ని మరింత పెంచుకుంది. సెప్టెంబర్‌లో మహీంద్రా కంటే 3,492 యూనిట్లు, హ్యుందాయ్ కంటే 5,339 యూనిట్లు మాత్రమే ముందున్న టాటా... అక్టోబర్‌లో ఆ ఆధిక్యాన్ని మహీంద్రాపై సుమారు 7,900 యూనిట్లకు, హ్యుందాయ్‌పై 9,660 యూనిట్లకు పెంచుకోగలిగింది. ఇది దేశీయ ఆటోమొబైల్ సంస్థ ...