భారతదేశం, జూన్ 13 -- టాటా మోటార్స్​ కస్టమర్స్​కి బిగ్​ అప్డేట్​! రెండు ఎలక్ట్రిక్​ వాహనాలకు అపరిమిత కిలోమీటర్లతో 'లైఫ్​టైమ్​ వారంటీ'ని ప్రారంభించాలని టాటా మోటార్స్​ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అవి.. కర్వ్ ఈవీ, నెక్సాన్ ఈవీ. ఇక్కడ 'లైఫ్​టైమ్​' అంటే స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో వాహనం రిజిస్ట్రేషన్ చేసిన మొదటి తేదీ నుంచి పదిహేనేళ్ల వ్యవధి! ఇప్పటికే రిజిస్ట్రేషన్​ చేసుకున్న యజమానులు కూడా ఈ ప్రయోజనాలను పొందగలుగుతారు.

కేవలం 45 కిలోవాట్ల టాటా నెక్సాన్ ఈవీ యజమానులు మాత్రమే ఈ ప్రయోజనానికి అర్హులని గమనించాలి. రెండో రిజిస్ట్రేషన్ తర్వాత నెక్సాన్ ఈవీ 45, కర్వ్ ఈవీలకు 8 ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ ఉంటుంది. మొదటిది తర్వాత యజమానులందరూ యాజమాన్య బదిలీ గురించి బ్రాండ్​కు తెలియజేయాలని, లేని పక్షంలో బ్యాటరీ వారంటీ ఇవ్వబోమని టాటా తెలిపింది.

కొనుగోల...