భారతదేశం, డిసెంబర్ 9 -- జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కొంతకాలంగా భారత రోడ్లపై ఒక కొత్త ఎస్‌యూవీని టెస్ట్ చేస్తోంది. దీని పేరు మెజెస్టర్​. 2025లో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పోలో సంస్థ దీనిని తొలిసారి ప్రదర్శించింది. వాస్తవానికి ఈ ఎస్‌యూవీ, ఈ సంవత్సరం ప్రారంభంలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఖచ్చితమైన లాంచ్​ టైమ్​లైన్​ని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఇప్పుడు ఈ బ్రాండ్ మెజెస్టర్​ని ఎటువంటి కవరింగ్ లేకుండా రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. లాంచ్ అయిన తర్వాత, మెజెస్టర్​ ఎంజీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే ఉన్న గ్లోస్టర్ కంటే ప్రీమియం స్థానాన్ని టార్గెట్​ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎంజీ మెజెస్టర్​ ఎస్​యూవీని​ అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యమయ్యే మాక్సస్ డీ90 ఆధారంగా రూపొందించార...