భారతదేశం, జనవరి 21 -- భారతదేశంలో మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్ ఇప్పుడు హాట్ కేకులా మారుతోంది. హైబ్రిడ్ కార్లతో ఇప్పటివరకు మార్కెట్‌ను ఏలిన టయోటా, ఇప్పుడు తన మొట్టమొదటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు 'అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా' (Urban Cruiser Ebella)ను రంగంలోకి దించింది. దీనికి ప్రధాన ప్రత్యర్థి ఎవరంటే.. గతేడాదే మార్కెట్లోకి అడుగుపెట్టి తిరుగులేని బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న 'హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్'. ఈ రెండు ఎలక్ట్రిక్ దిగ్గజాల మధ్య ఉన్న కీలక వ్యత్యాసాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

టయోటా ఎబెల్లాను ప్రత్యేకమైన 'ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్'పై నిర్మించారు. దీని డిజైన్ చాలా క్లీన్‌గా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా దీని 'హ్యామర్ హెడ్' ఫ్రంట్ ఫేసియా, స్లీక్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ కారుకు ఒక ప్రీమ...