భారతదేశం, జూన్ 28 -- దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. టెంపో వెహికిల్​లో ముందు సీటు ఇవ్వలేదన్న కోపంతో, ఓ 26ఏళ్ల వ్యక్తి, తన తండ్రిని కాల్చి చంపేశాడు!

ఉత్తర దిల్లీ తిమర్​పుర్​ అనే ప్రాంతంలోని ఎంఎస్​ బ్లాక్​ వద్ద గురువారం రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో జరిగింది ఈ ఘటన. 60ఏళ్ల సురేంద్ర సింగ్​ సీఐఎస్​ఎఫ్​ సబ్​-ఇన్​స్పెక్టర్​గా ఇటీవలే రిటైర్​ అయ్యాడు. అనంతరం, తన కుటుంబాన్ని దిల్లీ నుంచి ఉత్తరాఖండ్​లోని స్వస్థలానికి షిఫ్ట్​ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఒక టెంపోని మాట్లాడాడు.

టెంపోలో సామాన్లు ఎక్కిస్తుండగా.. కుమారుడు దీపక్​తో సురేంద్ర సింగ్​కి వాగ్వాదం మొదలైంది. ఫ్రెంట్​ సీటులో ఎవరు కూర్చోవాలి? అన్న విషయంపై ఇద్దరు గొడవపడినట్టు తెలుస్తోంది.

ఇంతలో దీపక్​ అగ్రెసివ్​ అయ్యాడు. తండ్రి లైసెన్స్​డ్​ గన్​ వెతికి, తీసుకొచ్చి, సురేంద...