Hyderabad, జూన్ 19 -- జ్యేష్ఠ శుక్ల దశమి నాడు గంగా దేవి దివి నుండి భువికి దిగిన రోజే కాదు, ఆమె విష్ణుపాదాల నుంచి పుట్టినరోజు కూడా. గంగాదేవి మొదట్లో సృష్టికర్త బ్రహ్మ కమండలంలో ఉండేది. విష్ణువు వామనావతారమెత్తినప్పుడు బలిచక్రవర్తి స్వామికి మూడడుగులు దానమిస్తున్నప్పుడు, ఆయన పాదాలు కడగడానికి వామనుడి ఎడమ కాలిగోటి రంధ్రం నుండి గంగాదేవి జన్మించింది. అప్పుడు ఆ గంగను బ్రహ్మ మొదటగా ఉపయోగించాడు. అదే బ్రహ్మ కడిగిన పాదం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పూర్వకాలంలో హిమవంతుడనే రాజు, ఆయన భార్య మనోరమ ఉండేవాళ్లు. వాళ్ళ పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ. స్వేదగా ప్రవహించకలిగే గుణమున్న గంగను స్వర్గలోకానికి పంపిస్తే, ఆ జలాలను ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుని ప్రార్థించగా సరే అన్నాడు...