భారతదేశం, జనవరి 14 -- తెలుగులో తెరకెక్కుతోన్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా రాయుడు గారి తాలూకా. శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా రూరల్ ఎంటర్‌టైనర్ 'రాయుడి గారి తాలుకా' షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన రాయుడు గారి తాలూకా సినిమాకు కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే మొదటి పాట 'జాతరొచ్చింది' రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ పొందింది.

రాయుడు గారి తాలూకా నుంచి మొన్న విడుదలైన జాతరొచ్చింది పక్కా మాస్ బీట్ ఐటమ్ సాంగ్‌గా అలరించింది. ఈ సాంగ్‌ను సోగ్గాడే చిన్ని నాయనా, బంగర్రాజు సినిమాల డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కూరసాల విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా ఇవాళ (జనవరి 14) మరో దర్శకుడు చేతుల మీదుగా మరో పాటను రిలీజ్ చేశారు.

ఈసారి రాయుడు...