భారతదేశం, నవంబర్ 2 -- కల్తీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అధికారులు తీసుకెళ్లారు. అయితే తాజాగా జోగి రమేష్ మీద టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. జోగి రమేష్ గురించి ఆలోచన చేయడం సీఎం చంద్రబాబుకు అనవసరం అని వెంకన్న చెప్పారు. జనార్ధన్ రావు ఇచ్చిన సమాచారంతో జోగి రమేష్ అరెస్ట్ అయ్యారని తెలిపారు. విచారణలో మాజీ సీఎం జగన్ పేరు బయటకు వస్తుందన్నారు.

'చంద్రబాబు, లోకేశ్‌లకు అరెస్టుతో సంబంధం లేదు. జోగి రమేష్ బీసీ కార్డు వేసుకోవడానికి సిగ్గు ఉండాలి. దోచిన ఆస్తులను బీసీలకు పంచి పెట్టాలి. జగన్‌కు కూడా ఈ నకిలీ మద్యం కేసులో పాత్ర ఉంది. మద్యం కుంభకోణం కేసులో కూడా తాడేపల్లి ప్యాలెస్‌కు డబ్బ...