భారతదేశం, డిసెంబర్ 21 -- కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రారంభమైంది. అవసరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాత జియో మైసూర్ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. బంగారం నిక్షేపాలు ఉన్నట్టుగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(GSI) గుర్తించింది. దీంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున తవ్వకాలు ప్రారంభమయ్యాయి. జొన్నగిరి, పొరుగున ఉన్న పగిడిరాయి గ్రామాలు బంగారు నిక్షేపాలకు ప్రసిద్ధి చెందాయి. పరిశోధనల తర్వాత ఈ ప్రాంతంలోని నేలలో బంగారు నిక్షేపాలు ఉన్నాయని నిర్ధారించాయి.

రాష్ట్ర ప్రభుత్వం 1,477 ఎకరాల్లో మైనింగ్ అనుమతిని మంజూరు చేసింది. జియో మైసూర్ సంస్థ తవ్వకాలు చేస్తోంది. కంపెనీ ప్రతినిధుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాంతంలోని ప్రతి టన్ను మట్టికి 1.5 నుండి 2 గ్రాముల బంగారం ఉంటుందని అంచనా. ఉత్పత్తి, ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్రతి 1,000 టన్నుల మట్టి న...