భారతదేశం, సెప్టెంబర్ 8 -- నటుడు సంజయ్ దత్ జైలు అనుభవం అతనిపై చెరగని ముద్ర వేసింది. నటన పట్ల తనకున్న మక్కువ జైలు శిక్షను ఎలా ఎదుర్కోవటానికి సహాయపడిందో ఇటీవల ఆయన వెల్లడించారు. జైలు లోపల తాను ఒక థియేటర్ గ్రూపును ఏర్పాటు చేశానని, హత్య దోషులను నటులుగా చేసుకున్నానని ఆయన సంచలన విషయాలు చెప్పారు.

సంజయ్ దత్ ఇటీవల సునీల్ శెట్టితో కలిసి ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోకు వెళ్లాడు. ఈ షోలో జైలులో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకున్నాడు. తన జీవితం గురించి మాట్లాడుతూ.. "నా జీవితంలో జరిగిన దేనికీ నేను చింతించను. నా ప్రధాన విచారం ఏమిటంటే నా తల్లిదండ్రులు చాలా త్వరగా నన్ను వదిలి వెళ్లిపోయారు. నేను వారిని నిజంగా మిస్ అవుతున్నా'' అని సంజయ్ దత్ పేర్కొన్నారు.

అర్చన పురాన్ సింగ్ సంజయ్‌ను జైలులో వడ్రంగి పని చేస్తున్నప్పుడు నిర్మించిన ఫర్నిచర్‌తో ఏమి చేసానని అడిగారు. ...