భారతదేశం, డిసెంబర్ 6 -- తెలుగులో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ధర్మ మహేష్. ఇదివరకు డ్రింకర్ సాయి సినిమాతో హీరోగా మెప్పించారు ధర్మ మహేష్. హీరోగానే కాకుండా వ్యాపారంలో కూడా రాణించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ఈ యంగ్ హీరో.

జిస్మత్ మండి అధినేత అయిన ధర్మ మహేష్ చైతన్యపురిలో తమ రెండవ బ్రాంచ్‌ను ప్రారంభించారు. భోజనప్రియులకు నాణ్యతతో కూడిన నోరూరించే వంటకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా సినీ హీరో ధర్మ మహేష్ మాట్లాడుతూ తన కుమారుడు జగద్వాజపై ఉన్న ప్రేమతో గిస్మత్ (Gismat) మండిని జిస్మత్ (Jismat) మండీగా మారుస్తూ అతిథి రంగంలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ రీబ్రాండింగ్ Gismat నుంచి Jismatకు మార్చాము. ఇది నాణ్యత, భావోద్వేగం, వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను సూచిస్తుందని ధర్మ మహేష...