భారతదేశం, డిసెంబర్ 24 -- బుధవారం స్టాక్ మార్కెట్ పెద్దగా కదలికలు లేకుండా మందకొడిగా సాగుతున్నప్పటికీ, జేబీఎం ఆటో (JBM Auto) షేర్లు మాత్రం ఇన్వెస్టర్లలో జోష్ నింపాయి. డిసెంబర్ 24 నాటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఈ మిడ్-క్యాప్ ఆటో కాంపోనెంట్ స్టాక్ ఏకంగా 12.6 శాతం మేర దూసుకెళ్లింది.

మార్కెట్ మందగించినా.. జేబీఎం దూకుడు మునుపటి ముగింపు ధర రూ. 577.90 తో పోలిస్తే, నేడు రూ. 593.75 వద్ద ఈ షేరు ప్రారంభమైంది. మధ్యాహ్నం 2.45 గంటల సమయానికి రూ. 652 గరిష్ట స్థాయిని తాకింది. కేవలం కొన్ని గంటల్లోనే 1.5 కోట్లకు పైగా షేర్లు చేతులు మారడం ఈ స్టాక్ పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది.

వరుసగా రెండో రోజూ ఈ షేరు లాభాల బాటలో పయనిస్తోంది. గత రెండు నెలలుగా నష్టాలను చవిచూసిన ఈ స్టాక్, డిసెంబర్ నెలలో ఇప్పటివరకు 3 శాతం కోలుకుంది. అయితే, ఈ ఏడాది మొత్తంగా చూస్తే సెన్సెక్స్ 9 శ...