Hyderabad, జూన్ 19 -- బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ 2020లో తన సినిమా ఛపాక్ విడుదలకు కొద్ది రోజుల ముందు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)కి వెళ్లిన విషయం తెలుసు కదా. ఇది భారీ వివాదానికి దారితీసింది. ఆమె సినిమాపై నిషేధం విధించాలని కూడా కొందరు డిమాండ్ చేశారు.

తాజాగా, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి యూట్యూబర్ సుభాంకర్ మిశ్రా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించాడు. దీపికాకు జేఎన్‌యూలోని రాజకీయాల గురించి ఏమీ తెలియదని, సినిమా ప్రమోషన్ కోసమే అక్కడికి వెళ్లారని అతడు అనడం గమనార్హం.

ఈ ఇంటర్వ్యూలో వివేక్ ఇలా చెప్పాడు. "దీపికాకు తాను ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియదు. జేఎన్‌యూలో రాజకీయాలు ఎలా ఉంటాయో ఆమెకు అసలు ఐడియా లేదని నేను గ్యారంటీగా చెప్తాను. ఆమె పీఆర్ టీమ్ ఇది సినిమా ప్రమోషన్‌కు మంచి అవకాశమని, ఈ ప్రదేశం రాజకీయంగా సున్నితమైనదని, సినిమా...