భారతదేశం, ఫిబ్రవరి 16 -- సాధారణంగా ఐఐటీల్లో (ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ) సీటు సాధించాలంటే అత్యంత కఠినమైన జేఈఈ పరీక్ష రాయాల్సిందే అని అందరూ భావిస్తారు. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా ఐఐటీలు తమ విద్యా విధానాన్ని సమూలంగా మార్చుకుంటున్నాయి. కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులకే కాకుండా, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఆర్ట్స్, కామర్స్ నేపథ్యం ఉన్నవారికి కూడా తమ తలుపులు తెరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేఈఈ స్కోర్‌తో సంబంధం లేకుండా ఐఐటీలు అందిస్తున్న కొన్ని ప్రముఖ కోర్సుల వివరాలు ఇక్కడ చూసేయండి..

1. జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ అప్లికేషన్స్ - ఐఐటీ గువాహటీ

లైఫ్ సైన్సెస్ లేదా బయోటెక్నాలజీ రంగంలో రాణించాలనుకునే వారికి ఇది చక్కని అవకాశం. ఈ ఎన్​పీటీఈఎల్​ కోర్సు ద్వారా జెనెటిక్ ఇంజనీరింగ్ మూలాలు, మోడరన్ మాలిక్యులర్ బయాలజీ, క్లోనింగ్ వంటి అధునాతన అంశాలను ...