భారతదేశం, జనవరి 8 -- దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్ఠాత్మక జేఈఈ మెయిన్ (JEE Main) 2026 సెషన్-1 పరీక్షకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షా నగరాల సమాచార స్లిప్పులను (Exam City Intimation Slip) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్ష రాసే విద్యార్థులు తమకు ఏ నగరంలో పరీక్ష కేంద్రం కేటాయించారో ఇప్పుడు తెలుసుకోవచ్చు.

విద్యార్థులు కింద సూచించిన సులభమైన దశలను అనుసరించి తమ ఎగ్జామ్ సిటీ స్లిప్‌ను పొందవచ్చు:

ఈ సిటీ స్లిప్ కేవలం విద్యార్థులకు ఏ నగరంలో పరీక్ష పడిందో ముందే తెలియజేయడానికి మాత్రమే. తద్వారా వారు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుంటుంది. అసలైన అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) పరీక్షకు కొన్ని రోజుల ముందు విడిగా విడుదల చేస్తారు.

వివరాలు సరిచూసుకోండి: స్లిప...