భారతదేశం, ఏప్రిల్ 18 -- జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2025 సెషన్ 2 ఫలితాలను, ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసే తేదీలను, సమయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 ఫలితాలను రేపు ఏప్రిల్ 19న జేఈఈ మెయిన్ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో విడుదల చేస్తామని తెలిపింది.

అలాగే, జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీని ఏప్రిల్ 18 మధ్యాహ్నం 2 గంటల తరువాత జేఈఈ మెయిన్ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో అప్ లోడ్ చేస్తామని వెల్లడించింది. ఈ వివరాలను ఎక్స్ లో ఒక పోస్ట్ ద్వారా ఎన్టీఏ పంచుకుంది. అయితే, జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 తుది ఆన్సర్ కీని ఏప్రిల్ 17న అధికారిక వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసి, మళ్లీ కాసేపటికే ఎన్టీఏ తొలగించింది.

జేఈఈ మెయిన్స్ 2025 సెషన్-2 ఫైనల్ ఆన్సర్ కీని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల...