భారతదేశం, ఏప్రిల్ 19 -- ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్ రెండో విడత ఫలితాలు రాత్రి 12 గంటలకు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో రిజల్ట్ విడుదల చేశారు. ఈ పరీక్షలో 21 మంది జనరల్ కేటగిరీ విద్యార్థులు 100 ఎన్టీఏ స్కోర్లు సాధించారు. ఈడబ్ల్యూఎస్‌లో తెలంగాణకు చెందిన వి.అజయ్ రెడ్డికి, ఓబీసీలో ఢిల్లీకి చెందిన దక్ష్‌కు, ఎస్సీలో యూపీకి చెందిన శ్రేయాస్ లోహియా టాప్ స్కోర్ సాధించారు.

100 పర్సంటైల్ సాధించిన 24 మంది టాపర్లలో 22 మంది బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. బెంగాల్‌కు చెందిన దేవదత్త మాఝీ, ఆంధ్రాకు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ ఈ ఘనత సాధించారు. టాపర్లలో రాజస్థాన్ నుంచి ఏడుగురు, తెలంగాణ నుంచి ముగ్గురు, మహ...