భారతదేశం, ఏప్రిల్ 19 -- జేఈఈ మెయిన్-2025 లో మరోసారి శ్రీచైతన్య విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఓపెన్ కేటగిరీలో ఇద్దరు విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారని శ్రీచైతన్య యాజమాన్యం ప్రకటించింది. టాప్ 10 లో నాలుగు ర్యాంకులు వచ్చాయని పేర్కొంది. రికార్డు స్థాయిలో ర్యాంకులు సాధించి మరోసారి శ్రీ చైతన్య విద్యా సంస్థ ఇంజినీరింగ్ ప్రవేశాలకు ప్రముఖ సంస్థగా తన హోదాను నిలబెట్టుతుందని యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

తెలుగు రాష్ట్రాల నుంచి వంగా అజయ్ రెడ్డి (దరఖాస్తు సంఖ్య: 250310255592) ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 300కి 300 స్కోరు సాధించి ఫస్ట్ ర్యాంగ్ కైవసం చేసుకున్నారు. ఇదే కేటగిరీలో దేవదత్త మాఝి (దరఖాస్తు సంఖ్య: 250310016185, డీఎల్పీ) కూడా 1వ ర్యాంక్‌ను సాధించగా, తోష్నివాల్ శివన్ (దరఖాస్తు సంఖ్య: 250310391420, డీ...