భారతదేశం, నవంబర్ 24 -- ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్‌ 1 రిజిస్ట్రేషన్ గడువు నవంబర్ 27వ తేదీ రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. అదే రోజు రాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 31న ప్రారంభమయ్యాయి. గడువు నవంబర్ 27 వరకు ఉంది. ఈసారి ఆన్‌లైన్ దరఖాస్తు గడువులను పొడిగించబోమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే తెలిపింది.

శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు 10.60 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరం ఆన్‌లైన్ దరఖాస్తులు గణనీయంగా ఉన్నాయి. ఇప్పుడు జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్‌కు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

మరోవైపు డిసెంబర్ 1 నుండి 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు దిద్దుబాట్లు అందుబా...