భారతదేశం, జనవరి 29 -- ఇంజనీరింగ్ విద్యార్థుల కలల కల జేఈఈ (JEE Main). ఈ పరీక్షలో రాణించేందుకు విద్యార్థులు పడే కష్టం అంతా ఇంతా కాదు. అయితే, అభ్యర్థుల ప్రిపరేషన్‌ను మరింత సులభతరం చేస్తూ గూగుల్ ఒక అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ తన ఏఐ ప్లాట్‌ఫామ్ 'జెమిని' ద్వారా పూర్తి స్థాయి జేఈఈ మెయిన్ మాక్ టెస్టులను ఉచితంగా అందిస్తోంది.

ఈ అప్డేట్‌పై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందిస్తూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ.. "నేను గతాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాగలిగితే ఎంత బాగుంటుందో.. పోయిన వారం శాట్, ఈ వారం జెమినిలో ఉచితంగా అందుబాటులోకి వచ్చిన జేఈఈ మెయిన్ టెస్టుల పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నాను" అని రాసుకొచ్చారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ పూర్వ విద్యార్థి అయిన పిచాయ్, తను జేఈఈ రాసిన రోజులను గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశా...