భారతదేశం, అక్టోబర్ 31 -- జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఇంకొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఇంజినీరింగ్​లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష కోసం విద్యార్థులు ఇప్పటికే తమ ప్రిపరేషన్​ని పెంచారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందన సాథీ (SATHEE - Self-Assessment Test and Help for Entrance Exams) లో భాగంగా.. ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ కీలక ప్రకటన చేసింది. జేఈఈ మెయిన్స్​ 2026 జనవరి సెషన్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం 40 రోజుల పాటు ఉచిత ఆన్‌లైన్ క్రాష్ కోర్సును ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.

నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ జేఈఈ మెయిన్స్​ 2026 క్రాష్ కోర్సు, విద్యార్థుల్లో ప్రాథమిక భావనలపై పట్టును పెంచడం, వారి పరీక్షా పనితీరును మెరుగుపరచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కోర్సులో ఐఐటీ నిపుణుల...