భారతదేశం, డిసెంబర్ 24 -- దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో మరింత కఠిన రూల్స్​ని చూడబోతున్నారు. పరీక్షా కేంద్రాల్లో ఒకరికి బదులు మరొకరు రాసే 'ఇంపర్సనేషన్' అక్రమాలకు స్వస్తి పలికేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నుంచి నిర్వహించే కీలక పరీక్షల్లో అభ్యర్థుల గుర్తింపు కోసం 'ఫేషియల్ రికగ్నిషన్' (ముఖ గుర్తింపు) సాంకేతికతను తప్పనిసరి చేయనుంది. దీనితో పాటు దరఖాస్తు సమయంలోనే లైవ్ ఫోటోను అప్‌లోడ్ చేసే విధంగా కొత్త నిబంధనను తీసుకురానుంది.

ఈ కొత్త విధానాన్ని 2026 జనవరిలో జరిగే జేఈఈ మెయిన్స్​ పరీక్ష నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు ధృవీకరించారు. ఆ తర్వాత నీట్ వంటి ఇతర ప్రధాన పరీక్షలకు కూడా దీనిని విస్తరిస్తారు.

"వచ్చే ఏడాది జనవరిలో జరిగే జేఈఈ మెయిన్స్​ నుంచే ఈ కొత్త పద్ధతి అమల్లోకి ...