Hyderabad, ఏప్రిల్ 29 -- జెస్టేషనల్ డయాబెటిస్ మెల్లిటస్ (జిడిఎం) అనేది గర్భధారణ సమయంలో మహిళల్లో వచ్చే వ్యాధి. ఈ డయాబెటిస్ వచ్చిన గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరిలో ప్రసవం తరువాత ఈ డయాబెటిస్ అదుపులోకి వచ్చేస్తుంది. కానీ కొందరికి మాత్రం అది టైప్ 2 డయాబెటిస్ గా మారి జీవితాంతం కొనసాగుతుంది.

జెస్టేషనల్ డయాబెటిస్ వల్ల తల్లికి, పుట్టబోయే బిడ్డకు కూడా ఎన్నో ఆరోగ్య ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు గర్భిణీలు తెలుసుకోవాలి.

ముంబైలోని డయాబెటిస్ & వెల్నెస్ క్లినిక్ యొక్క డయాబెటాలజిస్ట్, ఫిజీషియన్ డాక్టర్ శుభశ్రీ పాటిల్ హెచ్టి లైఫ్‌స్టైల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం జెస్టేషనల్ డయాబెటిస్ అనేది నిశ్శబ్ద ముప్పుగా పనిచేస్తుంది. రక్తపోటు, అంటువ్యాధులు, హృదయ సంబంధ సమస్యలు వంటి పరిస్థితులను ఇది తీవ్రతరం చేస్తుంది. ఇది చివరికి ప్రాణాంతక ...