Hyderabad, జూలై 14 -- ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి టాలీవుడ్‌లో హీరోగా పరిచయం అవుతున్న సినిమా జూనియర్. ఈ మూవీకి రాధా కృష్ణ దర్శకత్వం వహించారు. యూత్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన జూనియర్ మూవీలో కిరీటి రెడ్డికి జోడీగా డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్‌గా చేసింది.

అలాగే, టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జెనీలియా జూనియర్ మూవీలో కీలక పాత్ర పోషించింది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన జూనియర్ సినిమా జూలై 18న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బెంగళూరులో జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో గాలి జనార్ధన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసి చిత్ర బృందాన్ని ఆశీర్వదించిన డాక్టర్ శివరా...