Hyderabad, జూలై 20 -- పెద్ద సినీ ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి హీరోలు, హీరోయిన్స్ వస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ లేదా బిజినెస్ పరంగా కూడా మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీల నుంచి ఇటీవల కాలంలో ఎక్కువగానే హీరోలు పుట్టుకొస్తున్నారు. అలా రీసెంట్‌గా టాలీవుడ్‌లోకి కొత్తగా వచ్చిన హీరో కిరీటి రెడ్డి.

కర్ణాటక మాజీ మంత్రి, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా కిరిటీ రెడ్డి అరంగ్రేట్రం చేసిన సినిమా జూనియర్. శ్రీలీల హీరోయిన్‌గా ఈ సినిమాలో కిరీటి రెడ్డితో ఆడిపాడింది. ఇక జూనియర్ సినిమాతో సుమారు 13 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోయిన్ జెనీలియా రీ ఎంట్రీ ఇచ్చింది.

జూలై 18న థియేటర్లలో విడుదలైన జూనియర్ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే, ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందు జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ...