Hyderabad, జూన్ 30 -- తొలి ఏకాదశి నుండే పండగలు మొదలవుతాయి. తొలి ఏకాదశి తర్వాత వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా ప్రతి పండుగ వస్తుంది. తొలి ఏకాదశి విశిష్టత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తొలి ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది, తొలి ఏకాదశి నాడు ఏం చేయాలి వంటి విషయాలను తెలుసుకుందాం.

ప్రతి నెలలో ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. తొలి ఏకాదశి నుంచి తెలుగు పండుగలు అన్నీ మొదలవుతాయి కనుక ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తి ఆలయాలను దర్శించడం, జాగరణ చేయడం కూడా మంచిదే. తొలి ఏకాదశిని దేవశయని ఏకాదశి అని కూడా అంటారు.

ఈసారి తొలి ఏకాదశి జూలై 6న వచ్చింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు. విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషతల్పంపై...