Hyderabad, జూలై 9 -- జ్యోతిష్య శాస్త్రంలో కుజుడికి ప్రత్యేక స్థానం ఉంది. కుజుడు శక్తి, ధైర్యానికి కారకుడు. దాదాపు 45 రోజులు పాటు ఒకే రాశిలో ఉంటుంది. కుజుడు కాలానుగుణంగా రాశిని మార్చినప్పుడు అది దేశం, ప్రపంచంతో పాటుగా ప్రజల వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం పడుతుంది.

మరోసారి, జూలై నెలలో కుజుడు గ్రహ సంచారం యాదృచ్ఛికంగా ఉంది. జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, జూలై 28 రాత్రి 7:58 గంటలకు కుజుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు, కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. వారి కెరియర్‌లో గొప్ప విజయాలను అందుకుంటారు, పెట్టుబడిలో ఆశించిన లాభాలు వస్తాయి. మరి అదృష్ట రాశులు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సింహ రాశి వారికి ఈ సంచారం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఉంటాయి, ఆర్థిక పరి...