Hyderabad, జూలై 17 -- ఏకాదశికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి నెల శుక్ల పక్షంలో, కృష్ణ పక్షంలో రెండు ఏకాదశులు వస్తాయి. ఆషాడ మాసం కృష్ణ పక్ష ఏకాదశి కామిక ఏకాదశి అని అంటారు. కామిక ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ సంవత్సరం కామిక ఏకాదశి ఎప్పుడు వచ్చింది? కామిక ఏకాదశి శుభ సమయం, పరిహారాలు గురించి తెలుసుకుందాం.

ఈ ఏడాది కామిక ఏకాదశి జూలై 20న వచ్చిందా, 21న వచ్చిందా అనే సందేహం చాలా మందిలో ఉంది. పంచాంగం ప్రకారం చూసినట్లయితే జూలై 20 మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశి తిథి మొదలవుతుంది, జూలై 21 ఉదయం 9:38 వరకు ఉంటుంది. ఈ లెక్కన జూలై 21న కామిక ఏకాదశిని జరుపుకోవాలి.

కామిక ఏకాదశి నాడు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకించి లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధించడం వలన సంత...