Hyderabad, జూలై 9 -- హిందూ క్యాలెండర్ ప్రకారం గురు పౌర్ణమి ఆషాడమాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు వస్తుంది. ఈ సంవత్సరం గురు పౌర్ణమి జూలై 10న వచ్చింది. జూలై 10న గురు పౌర్ణమి నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే వీటిని గురు పౌర్ణమి నాడు వీటిని ఇంటికి తీసుకురండి.

గురు పౌర్ణమి నాడు వీటిని ఇంట్లో ఉంచడం వలన సానుకూల శక్తి ప్రవహించడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అన్ని పౌర్ణముల కంటే గురు పౌర్ణమి చాలా విశిష్టమైనది. వేదాలు రచించిన వేదవ్యాసుడు ఆషాఢ శుక్ల పౌర్ణమి నాడు జన్మించారని అంటారు. అందుకే దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు.

గురు పౌర్ణమి నాడు పవిత్రమైన భగవద్గీతని ఇంటికి తెచ్చి పెట్టుకుంటే మంచిది. భగవద్గీతను చదివితే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ప్రశాంతకరమైన జీవితాన్ని గడపచ్చు.

గురు పౌర్ణమి సందర్భంగా మీ ఇంటికి శ్రీయంత్రాన్ని కూడా ...