Hyderabad, జూన్ 26 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళుతూ ఉంటాయి. ఈ సమయంలో కొన్ని సార్లు శుభయోగాలు, కొన్ని సార్లు అశుభయోగాలు ఏర్పడతాయి. 2025 జూలై నెల త్వరలో మొదలు కాబోతుంది. జూలై నెలలో కూడా కొన్ని గ్రహాలు సంచరిస్తాయి, కొన్ని గ్రహాలు తిరోగమనం చెందుతున్నాయి.

జూలై నెలలో రెండు గ్రహాల తిరోగమనం జరగడంతో 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి.

జూలై నెలలో శని, బుధుడు తిరోగమనం చెందుతున్నారు. జూలై 13 ఉదయం 9:36కి శని మీనరాశిలో తిరోగమనం చెందుతాడు. బుధుడు జూలై 18 రాత్రి 10:13కి తిరోగమనం చెందుతాడు. ఈ రెండు గ్రహాలు తిరోగమనం చెందడంతో 4 రాశుల వారికి చిన్నపాటి సమస్యలు వస్తాయి. ఆర్థికపరంగా కూడా చిన్నచిన్న ఇబ్బందులు కలుగుతాయి. మరి ఏ రాశుల వారికి ఇబ్బందులు కలుగుతాయి? ఎవరు జాగ్రత్తగా ఉ...