Hyderabad, జూన్ 27 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. జూలై నెలలో కూడా కొన్ని గ్రహాలు రాశిని మారుస్తున్నాయి. జూలై నెలలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు గ్రహాల మార్పు ఉంది. గురువు, శుక్రుడు, కుజుడు, బుధుడు, సూర్యుడు, శని తమ తమ రాశులను మారుస్తున్నారు. వీటి రాశి మార్పు కారణంగా 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది.

ముఖ్యంగా ఆరు రాశుల వారికి అనేక లాభాలు ఉంటాయి. కొన్ని రాశుల వారి ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. దాంతో పాటుగా చాలా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారికి జూలై నెల కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక శుభ ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కార్యాలయంలో మీ అద్భుతమైన పనితీరుతో ఆకట్టుకుంటారు. స...