Telangana, జూన్ 29 -- కృష్ణా బేసిన్ లో భారీగా వరద పారుతోంది. దీంతో జూరాల ప్రాజెక్ట్‌కు వరద నీరు వచ్చిచేరుతోంది. దీంతో 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో లక్షా 30 వేల క్యూసెక్కులుగా ఉండగా. ఔట్‌ఫ్లో లక్షా 44,076 క్యూసెక్కులుగా ఉంది.జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా. ప్రస్తుతం 317.200 మీటర్లుగా ఉంది.

ఈ జూరాల ప్రాజెక్ట్(ఆత్మకూరు- గద్వాల మధ్య) ఉంటుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఈ ప్రాజెక్ట్ జలప్రదాయినిగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ 1997లో వినియోగంలోకి వచ్చింది. మొత్తం 67 రేడియల్‌ గేట్లు ఉన్నాయి. ఇందులో కొన్నిగేట్ల రోప్‌లు నీటి తాకిడితో తుప్పుపట్టాయి. అంతేకాకుండా కొన్ని గేట్ల నుంచి నీటి లీకేజీ సమస్య ఉంది. గేట్ల మరమ్మత్తుల కోసం 2022లో రూ.11 కోట్లతో టెండర్లు పిలించారు. ఈ పనులు ప్రారంభయ్యాయి. అయితే అనుకున...