భారతదేశం, మే 16 -- బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన భార్య రహస్య రెండో వివాహాన్ని బహిర్గతం చేయడానికి గూఢచారిగా మారాడు. నకిలీ ఎంప్లాయర్ గా మారి జూమ్ కాల్ లో తన భార్య రెండో వివాహం చేసుకుందన్న విషయాన్ని ఆమె ద్వారానే తెలుసుకున్నాడు. మొత్తం రుజువులు సంపాదించి కోర్టుకు సమర్పించాడు. కోర్టు అతడికి విడాకులు మంజూరు చేయడమే కాకుండా, శాశ్వత భరణం కోసం అతని భార్య చేసిన డిమాండ్ ను తోసిపుచ్చింది. మొత్తానికి, నాలుగేళ్ల పాటు సాగిన విడాకుల కేసులో ఆ భర్త విజయం సాధించాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఆ భార్యాభర్తలిద్దరు బెంగళూరులో సాఫ్ట్ వేర్ జాబ్స్ లో ఉన్నారు. వారు దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ తాలూకాలో వివాహం చేసుకుని బెంగళూరులోని కేఆర్ పురంలో స్థిరపడ్డారు. ఆ తరువాత వారి మధ్య విబేధాలు పెరిగి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తన భర్తపై ఆ యువతి గృహహింస, వరకట...