Hyderabad, ఆగస్టు 16 -- ఓటీటీలో ఇటీవల స్ట్రీమింగ్‌కు వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా మయసభ దూసుకుపోతోంది. ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఈ సిరీస్‌కు డైరెక్టర్ దేవ కట్టా దర్శకత్వం వహించారు. సోనీ లివ్‌లో మయసభ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆది పినిశెట్టిని ఎంచుకోవడంపై దేవ కట్టా ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

"ఆది తన నటనా ప్రయాణాన్ని 2006లో వచ్చిన ఒక వి చిత్రమ్ సినిమాతో మొదలుపెట్టాడు. 2009లో తమిళంలో వచ్చిన ఈరమ్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం, మృగం, మరగత నాణయం వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనతో హీరో, విలన్ లేదా సపోర్టింగ్ పాత్ర ఏదైనా ఒకే స్థాయి నైపుణ్యంతో చేయగల వెర్సటైల్ నటుడిగా తన ముద్ర వేశాడు" అని దేవ కట్టా అన్నారు.

"నిన్ను కోరి సినిమాలో ఆదిని నేను మొట్ట మొదట గమనించాను. ఆయన డిక...