భారతదేశం, నవంబర్ 9 -- కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మెుత్తం ప్రచారంతో హీటెక్కింది. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం చేశాయి. ఏ వీధిలో చూసినా.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ జెండాలతో నేతలు ప్రచారంతో ఊపు తెచ్చారు. ఇక ఎన్నికల సంఘం పెట్టిన గడువు ప్రకారం 5 గంటలు ప్రచారం ముగిసింది. దీంతో మైకులు అన్ని బంద్ అయ్యాయి.

ప్రచార గడువు నవంబర్ 9 ఆదివారం సాయంత్రం 5 గంటల వరకే. దీంతో కాలనీలు, బస్తీలు, వీధుల్లో గుమిగూడిన రాజకీయ నాయకులు ఇప్పుడు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇరుకైన సందుల్లో మోగిన మైకుల చప్పుడు వినిపించడం లేదు, సందర్శించే నాయకులు కనిపించడం లేదు. ఇంటింటికి సందర్శనలు, పార్టీ కార్యకర్తలతో కోలాహలంగా కనిపించిన జూబ్లీహిల్స్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది.

రోడ్‌షోలు, పార్టీ అగ్ర నాయకుల ప్రసంగాలు, పార్టీల మధ్య బల ప్రదర్శన సాయంత్రం 5 గం...