భారతదేశం, ఆగస్టు 31 -- రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నిక రాబోతుంది. మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ స్థానానికి బైపోల్ జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ స్థానం ఖాళీగా ఉండగా. త్వరలోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాదిలోపే ఇక్కడ ఉపఎన్నికల జరిగే అవకాశాలు ఉండటంతో. ప్రధాన పార్టీలు కొద్దిరోజులుగా వ్యూహా, ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి.

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో డైలాగ్ వార్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు భాగ్యనగరంలో జరిగే ఉపఎన్నిక కావటంతో. బీజేపీ కూడా గట్టిగానే ఫోకస్ చేస్తోంది.

జూబ్లీహిల్స్ స్థానానికి ఉపఎన్నిక రానున్న నేపథ్యంలో.అధికార కాంగ్రెస్ ఇప్పటికే ఫోకస్ పెట్టేసింది. ఎల...