Hyderabad, సెప్టెంబర్ 3 -- త్వరలోనే జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరగనున్నాయి. మాగంటి గోపినాథ్ మృతితో ఈ స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏ క్షణమైనా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం.. తాజాగా ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది.

ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలో 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,04,288 మంది పురుషులు కాగా.. 1,88,356 మంది మహిళలు ఉన్నారు. ఈ ముసాయి జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే సెప్టెంబర్ 17 వరకు అప్లికేషన్లు ఇవ్వొచ్చు.

ఇక మార్పులు చేర్పులు మాత్రమే కాకుండా. కొత్తగా ఓటు నమోదు కూడా చేసుకునే వీలు ఉందని ఈసీ తెలిపింది. వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 29వ తేదీ వరకు పరిశీలిస్తారు. సెప్టెంబర్ 30...